Share News

‘పాత్రల్లో జీవించేవారు’.. నానా పటేకర్‌ మృతిపై ఎన్టీఆర్‌ భావోద్వేగం

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:00 AM

భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన నానా పటేకర్‌ మృతి పట్ల ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్‌ మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

‘పాత్రల్లో జీవించేవారు’.. నానా పటేకర్‌ మృతిపై ఎన్టీఆర్‌ భావోద్వేగం
NTR Tribute to Nana Patekar

హైదరాబాద్, అక్టోబర్ 8: భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన నానా పటేకర్‌ మృతి పట్ల ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్‌ మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొంటూ ఆయనకు నివాళులు అర్పించారు. నానా పటేకర్‌ పోషించిన ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉండేవని ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారీ అది కేవలం నటనగా అనిపించేది కాదని.. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి జీవిస్తున్నట్లుగా అనిపించేదని కొనియాడారు. విభిన్నమైన పాత్రలను తనదైన ప్రత్యేక శైలిలో పండిస్తూ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నానా పటేకర్‌.. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు.


భారతీయ సినిమాకు నానా పటేకర్‌ అందించిన సేవలు.. ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎన్టీఆర్‌ తెలిపారు. ఆయన నటించిన ఎన్నో పాత్రలు, పలికించిన సంభాషణలు, తెరపై చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. ఒక గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా తన ప్రతిభతో.. వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అద్భుతమైన కళాకారుడిగా నానా పటేకర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఈ విషాద సమయంలో తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ.. నానా పటేకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్‌ ప్రార్థించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Oct 08 , 2026 | 10:48 AM