Share News

మూడున్నరేళ్ల కిందటే డ్రగ్స్‌ నిర్మూలనకు బీజం

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో మూడున్నరేళ్ల కిందటే మాదకద్రవ్యాల నిర్మూలనకు బీజం పడిందని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

మూడున్నరేళ్ల కిందటే డ్రగ్స్‌ నిర్మూలనకు బీజం

  • యాంటి నార్కోటెక్‌, ఈగల్‌ వల్లే ముందంజలో ఉన్నాం

  • ట్రాఫిక్‌ నిబంధనల అమలుకు టీజీ టీమార్స్‌: డీజీపీ ఆనంద్‌

కామారెడ్డిటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడున్నరేళ్ల కిందటే మాదకద్రవ్యాల నిర్మూలనకు బీజం పడిందని డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. యాంటి నార్కోటెక్‌, ఈగల్‌ టీమ్‌ల ద్వారా మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు చేపట్టి ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ తీసుకున్న అనేక రకాల చర్యలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు పాటించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.


కామారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్‌క్రైంతో పాటు ఇతర నేరాల కట్టడిపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడారు. నషా ముక్త్‌ భారత్‌ వైపు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని ప్రధాని మోదీ ప్రతి సమావేశంలో పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. 2029 డిసెంబరు 31వరకు మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్‌ సెక్యూరిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనల అమలుకు టీజీ టీమార్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:23 AM