హరీశ్ అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే: కవిత
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:53 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు అవినీతిపై నిగ్గుతేల్చాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నిజామాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి హరీశ్‌రావు అవినీతిపై నిగ్గుతేల్చాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆయన చేసిన అవినీతిపై ప్రజాక్షేత్రంలో కొట్లాడడంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాల ద్వారా పోరాటం చేస్తామని అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలను సీబీసీఐడీకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు పంపిస్తామని, తప్పుచేసిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష పడాలనేదే తమ విధానమన్నారు.
ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. ప్రధాని మోదీని కలిసిన సీఎం రాష్ట్రంలో నెలకొన్న కరువుపై మాట్లాడకపోవడం దారుణమని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విమర్శించారు. పాంచజన్య సంకల్పంలో భాగంగా భైరవ వాహనంలో త్వరలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడతామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్