గుండెపోటుతో బాలిక హఠాన్మరణం
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:32 AM
పదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పెద్దాయిపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది.
రాజంపేట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పెద్దాయిపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. గాలి పవన్‌కుమార్, లక్ష్మి దంపతుల కూతు రు మహాన్విత నాలుగో తరగతి చదవుతోంది. అయితే, ఆది వారం అర్ధరాత్రి ఇంట్లో గుండెనొప్పితో కింద పడిపోయింది. వారు వెంటనే ఆ చిన్నారిని కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి సీపీఆర్ చేసినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు
Read Latest AP News And Telangana News And International