Share News

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:30 PM

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో పెద్దపులి ఇటీవల రెండు ఆవులను చంపేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
Kodimyal Mandal Tiger Sighting

జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గంగారం తండా గ్రామంలో ఇటీవల రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి వాటిని చంపేసింది. ఈ ఘటనల కారణంగా గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. పులి సంచారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలను పరిశీలిస్తున్నారు. గ్రామస్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Read Latest Telangana News

Updated Date - Mar 17 , 2026 | 08:16 PM