నా కలను నెరవేరుస్తారా.. నయనతారపై తమిళనాడు ఎంపీ అనుచిత వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:14 PM
ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ సీవీ షణ్ముగం వివాదంలో చిక్కుకున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో నయనతార ప్రస్తావన తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ సీవీ షణ్ముగం వివాదంలో చిక్కుకున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో నయనతార ప్రస్తావన తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత కోసం విల్లుపురంలో మంగళవారం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అన్నాడీఎంకే రాజ్యసభ్య సభ్యుడు షణ్ముగం, నయనతారను కించపరిచేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Nayanthara remark issue).
ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. 'మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది' అని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం హామీకి వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించిన షణ్ముగం అనవసరంగా నయనతార ప్రస్తావన తీసుకొచ్చారు. 'కలలు కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలని స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే.. ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా' అని వ్యాఖ్యానించారు (AIADMK controversy).
మహిళల భద్రత గురించి ఉద్దేశించిన కార్యక్రమంలో షణ్ముగం ఇలా మాట్లాడడంతో విమర్శలు చెలరేగుతున్నాయి (AIADMK leader statement). షణ్ముగం కామెంట్లపై డీఎంకే పార్టీ స్పందించింది. 'మా విధానాలను విమర్శించండి. కానీ, మహిళల గురించి అనుచితంగా మాట్లాడకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ మీరు అవమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు' అని డీఎంకే పేర్కొంది.
కాగా, నయనతారపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను నడిగర సంఘం ఖండించింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలను తాము ఒప్పుకోమని, బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, బేషరతుగా నయనతారకు క్షమాపణ చెప్పాలని నడిగర సంఘం డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..