Share News

తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో కలకలం.. డిప్యూటీ కమిషనర్ రాజీనామా..

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:59 PM

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో కలకలం.. డిప్యూటీ కమిషనర్ రాజీనామా..
Nizamabad

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆరోపించారు. తన 30 ఏళ్ల సేవలను వదులుకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. ఎక్సైజ్ కమిషనర్ మాటలతో మనస్తాపం చెంది, ఆస్పత్రి పాలైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ మాటలు, వేధింపులు తట్టుకోలేకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. బదిలీల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. లోయర్ క్యాడర్ ఉద్యోగుల ముందు కమిషనర్ ఇష్టానుసారం మాట్లాడడం బాధ కలిగించిందని భావోద్వేగానికి గురయ్యారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చెయ్యలేనంటూ ప్రభుత్వానికి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి లేఖ రాశారు.


తప్పు చేయకుండా మాటలు పడలేం: సోమిరెడ్డి

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సోమిరెడ్డి మాట్లాడుతూ.. 'గురువారం అర్ధరాత్రి నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ల బదిలీల సమావేశం జరిగింది. సూపరింటెండెంట్ల ట్రాన్స్‌ఫర్ల విషయంలో ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అన్యాయంగా మాట్లాడారు. ఎక్సైజ్ కమిషనర్ తీరు సరిగా లేదు. నన్ను ఒక వెధవ అని సంబోధించారు. నన్నే కాదు చాలా మంది సిబ్బందిని ఇలానే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. రెండు సంవత్సరాల నుంచి కమిషనర్ తీరు ఇలాగే ఉంది. ఒక తెలంగాణ వ్యక్తిగా ఏ తప్పు చేయకున్నా అధికారి తిడితే మాటలు పడలేం. అందుకే ఇక ఈ ఉద్యోగం చేయకూడదని డిసైడ్ అయ్యాను. 30 ఏళ్ల సర్వీస్ వదులుకుంటున్నందుకు బాధగా ఉన్నా తప్పడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

Updated Date - Apr 11 , 2026 | 06:18 PM