ఈ మున్సిపాలిటీలో దంపతులదే ఆధిపత్యం..
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:25 PM
నిర్మల్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో భార్యాభర్తలకే చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం విశేషంగా మారింది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..
నిర్మల్: నిర్మల్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు భార్యాభర్తలకే దక్కడం విశేషంగా మారింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి కూడా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో నిర్మల్ మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంపై ఆసక్తి నెలకొంది.
అశ్వారావుపేట మున్సిపాలిటీలో..
ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చైర్‌పర్సన్‌గా శశికళ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా ఆమె భర్త రమేష్ ఎన్నికయ్యారు. భార్యాభర్తలే మున్సిపల్ పీఠాలను అధిష్టించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..
చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్
హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్ పీఠం
For More TG News And Telugu News