Share News

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుల దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:39 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుల దర్శనానికి పోటెత్తిన భక్తులు
Yadagirigutta Temple

యాదాద్రి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు రావడంతో కొండపై ఆలయ మాడవీధులు, దర్శన క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శన క్యూలైన్లలో భక్తులు రెండు గంటల పాటు నిరీక్షించారు. ఆలయ ఖజానాకు నిత్య కైంకర్యాల ద్వారా రూ.39,38,712 ఆదాయం సమకూరింది. ఆలయాన్ని సందర్శించిన ప్రముఖుల్లో హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు ఉన్నారు. మరోవైపు సోమవారం శరద్‌ పౌర్ణమి సందర్భంగా స్వామివారితో పాటు మహాలక్ష్మి రూపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు వైభవంగా నిర్వహిస్తారు. నిండు చంద్రుడి కిరణాల చల్లని వెలుగులో స్వామివారికి, అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా నివేదిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు

మూతబడ్డా మాయ చేస్తున్నరు!

పౌరసరఫరాల్లో వసూళ్ల దందా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:39 AM