గురుకుల విద్యార్థినులపై వేధింపుల ఘటనలో..అడ్డగూడూరు ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:13 AM
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై వంట మనిషి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రిన్సిపాల్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అడ్డగూడూరు/కల్లూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై వంట మనిషి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రిన్సిపాల్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణిని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు.
దీంతో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి బుధవారం పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థినులను వేధించిన తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన వంట మనిషి వెంకన్నపై మంగళవారమే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌లోని అతని సోదరి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి, మెస్ అటెండర్ పూలమ్మ, ఆమె భర్త (సబ్ కాంట్రాక్టర్) సోమయ్య, కాంట్రాక్టర్ మధులను కూడా అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపర్చినట్లు అడ్డగూడూరు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News