Share News

టెండర్లు వద్దనడం విడ్డూరం

ABN , Publish Date - May 03 , 2026 | 11:39 PM

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3, (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట కొండపైన 114 దుకాణాల నిర్వహణకు టెండర్దు వద్దనడం విడ్డూరంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

 టెండర్లు వద్దనడం విడ్డూరం

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3, (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట కొండపైన 114 దుకాణాల నిర్వహణకు టెండర్దు వద్దనడం విడ్డూరంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం యాదగిరిగుట్ట ఏర్పాటు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉదయం వర్తక సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి దుకాణాలకు టెండర్లు వేయవద్దని కోరడం సరికాదన్నారు.60 ఏళ్ల నుంచి దుకాణాలు టెండర్లు ఎందుకు వేయలేదని దేవాదాయ శాఖ చట్టాలు వీరికి వర్తించాయని ప్రశ్నించారు. ప్రతిసారి దుకాణాలు టెండర్లు వేయకుండా దేవస్థానం ఆదాయానికి గండికొడుతూ ప్రతిసారి దుకాణాలు వారే దక్కించుకుంటున్నారని అన్నారు. పట్టణంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారని వారికి ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పటికీ వారికే ఎందుకు రెన్యువల్‌ చేయాలని ప్రశ్నించారు. 114 దుకాణాల్లో కొందరు యజమానులు సబ్‌ లీజ్‌కు ఇచ్చి ప్రతినెల వేల రూపాయాలు దండుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఆకుల చంద్రమౌళి, తాళ్ల భాస్కర్‌రెడ్డి, మందోజు నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:39 PM