బైక్‌ను ఢీకొన్న స్కూల్ బస్సు... ఇద్దరి మృతి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:01 PM
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి, శాలి గౌరారం మండలం ఊట్కూరు వాసులుగా గుర్తించారు.
నల్లగొండ, మార్చి 2: నల్లగొండ మండలం చందనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బావబామ్మర్దులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను వంశీ (30), రమేష్ (30)గా గుర్తించారు. వీరు నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి, శాలి గౌరారం మండలం ఊట్కూరు గ్రామస్తులు. నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు బైక్‌పై వెళ్తుండగా చందనపల్లి వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌కు రాహుల్.. ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం
పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News