Share News

హైదరాబాద్‌కు రాహుల్.. ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం

ABN , Publish Date - Mar 02 , 2026 | 09:50 AM

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్‌కు రాహుల్.. ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం
Rahul Gandhi

హైదరాబాద్, మార్చి 2: ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈరోజు(సోమవారం) ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో ఇరువురూ వికారాబాద్ జిల్లాకు బయలుదేరారు. వికారాబాద్ ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.


rahul-rev.jpg

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర కీలక విషయాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులను ఖరారు చేసే అవకాశం ఉంది. రాజ్యసభ రేసులో అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, వీహెచ్, దొమ్మటి సాంబయ్య, బెల్లయ్య నాయక్, హజ్మతుల్లా హుస్సేన్ ఉన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం అనంతగిరి హరిత హోటల్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

ఖమేనీ జీవితాన్ని మార్చేసిన 1981 ఉదంతం.. 45 ఏళ్లుగా కోటు వెనకాల చెయ్యి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 11:36 AM