Share News

చెట్టుకు రాఖీ.. ప్రకృతిపై ప్రేమ చాటిన పర్యావరణ ప్రేమికుడు

ABN , Publish Date - Aug 28 , 2026 | 02:23 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ పండుగ వేళ ఓ పర్యావరణ ప్రేమికుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి.. పర్యావరణంపై తన ప్రేమను వ్యక్తం చేశాడు.

చెట్టుకు రాఖీ.. ప్రకృతిపై ప్రేమ చాటిన పర్యావరణ ప్రేమికుడు
Suresh Gupta

నల్గొండ, ఆగస్టు 28: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ పండుగ వేళ ఓ పర్యావరణ ప్రేమికుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి.. పర్యావరణంపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. గతంలో తాను నాటిన రావి చెట్టు మహావృక్షంగా ఎదగడంతో.. అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాఖీ పండగ సందర్భంగా ఆ చెట్టుకు ఆవు పిడకతో చేసిన రాఖీని కట్టి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు.

Suresh-Nalgonda.jpg


అతడి పేరు సురేష్ గుప్తా. అతడి స్వస్థలం నల్గొండ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా భావించి సంరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చెట్టుకు రాఖీ కట్టి దానిని సంరక్షణకు ప్రతిజ్ఞ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే సందేశాన్ని ఇచ్చినట్లు సురేష్ గుప్తా వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబరు 1 నుంచి.. దానాపూర్‌ - బెంగళూరు రైలు

హెల్మెట్ లేనివారికి రాఖీ కట్టారు.. పోలీసుల వినూత్న కార్యక్రమం

For More TG News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 02:40 PM