Share News

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి

ABN , Publish Date - May 16 , 2026 | 11:56 AM

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. వెంటనే బాలుడి తాత అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించాడు.

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి
Borewell Incident

నల్లగొండ, మే 16: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే బాలుడి తాత వెంకన్న అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు బోరుబావిలోకి దిగాడు. ఈ క్రమంలో బోరుబావిలో వెంకన్న తలకిందులుగా ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.


పోలీసు బృందం ఎంతో శ్రమించి తాత, మనవడిని బయటకు తీశారు. వెంటనే ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే బోరుబావిలో తలకిందులుగా ఇరుక్కోవడంతో ఊపిరాడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బోరుబావులను సరిగా మూయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనవడిని రక్షించబోయి తాత ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి...

పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు

పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2026 | 12:14 PM