ఏడాదిలో గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:27 PM
గంధమల్ల రిజర్వాయర్ ఏడాది లోపు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
యాదాద్రి, నవంబర్ 27: గంధమల్ల రిజర్వాయర్ ఏడాది లోపు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రిలో ఆయన మాట్లాడుతూ.. శ్మశాన వాటిక అడ్డముందని వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని చెప్పి.. రహదారులు వేయించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలేరు ఎమ్మెల్యే కాక ముందు బీర్ల అయిలయ్య ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అయిలయ్యను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇప్పిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. అవసరమైతే తనకు పదవి రాకున్నా అయిలయ్య కోసం కొట్లాడతానని అన్నారు. అయిలయ్యను చూసే ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు తాను తోచిన సాయం చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశానికి రోల్ మోడల్ కానున్న తెలంగాణ భూ సర్వే: మంత్రి పొంగులేటి
ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ