రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:24 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
రంగారెడ్డి, అక్టోబర్ 8: మొయినాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొయినాబాద్‌కు చెందిన దుబ్బా సుభాష్(35) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జయంత్ బల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జయంత్ బల్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బైక్‌ను కారు బలంగా ఢీకొనడంతో సుభాష్‌కు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై మృతుడి సోదరుడు వరప్రసాద్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ పుత్తారి నవీన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారు వేగం తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News