Share News

దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:24 PM

ఇరాన్-ఇజ్రాయెల్ మద్య భీకర యుద్ధ జరుగుతోంది. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దుబాయితో పాటు గల్ఫ్ దేశాలు తమ గగన తలాన్ని మూసేశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ మద్య భీకర యుద్ధ జరుగుతోంది. పశ్చిమ ఆసియా(Middle East) దేశాల్లోనెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దుబాయితో పాటు గల్ఫ్ దేశాలు తమ గగన తలాన్ని మూసేశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) దుబాయ్‌(Dubai)లో చిక్కుకుపోయారు. గత ఐదు రోజుల క్రితం ఆయన దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో, మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి రావాలని భావిస్తున్న సమయంలో పశ్చిమ ఆసియాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆయన దుబాయ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఆదివారం అర్థరాత్రి దుబాయ్ ఎయిర్ పోర్ట్ (Dubai International Airport)లోని టెర్మినల్ - 3 సమీపంలో క్షిపణి దాడులు జరినట్లు సమాచారం. భద్రతా కారణాలతో అక్కడ ప్రభుత్వం విమానా రాకపోకలు నిలిపివేశాయి. దీంతో మంత్రి తుమ్మల అక్కడే చిక్కుకుపోయారు.

సురక్షితంగానే ఉన్నా..

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అన్ని విమానాలను అక్కడ ప్రభుత్వం రద్దు చేయడంతో మంత్రి తుమ్మల దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, తాను సురక్షితంగా ఉన్నానని, ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇచ్చే వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి అని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తుమ్మల తెలిపారు.


ఇవి కూడా చదవండి

టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్

రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం

Updated Date - Mar 02 , 2026 | 01:28 PM