Share News

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ప్రొ.జయశంకర్‌ పేరు పెట్టాలి

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:59 AM

సనత్‌నగర్‌ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ప్రొ.జయశంకర్‌ పేరు పెట్టాలి
Minister Komatireddy Venkatreddy

  • సీఎంను కోరిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న అల్వాల్‌ టిమ్స్‌కు మాజీ సీఎం టి.అంజయ్య పేరు, ఎల్‌.బీ నగర్‌ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేర్లను పెట్టాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 18 , 2026 | 08:59 AM