నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఉత్తమ్ కుమార్
ABN , Publish Date - Aug 15 , 2026 | 04:43 PM
తెలంగాణలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా కూడా సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 3.42 కోట్ల మందికి రూ.14800 కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
సంగారెడ్డి, ఆగస్టు 15: తెలంగాణలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా కూడా సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 3.42 కోట్ల మందికి రూ.14800 కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. BRS ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే.. వాటిని 2.80 కోట్లకు పెంచామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు.. నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. BRS పార్టీలోని నేతలు పదే పదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల నుంచి చుక్క నీరు తీసుకోకుండా దేశంలోనే ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణలో పండించామన్నారు. వరి కొనుగోళ్లలో రూ.90 వేల కోట్లు.. రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుందన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని వెల్లడించారు. కొత్తగా 16 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. BRS హయాంలో రేషన్ కింద దొడ్డు బియ్యం ఇచ్చారని.. అప్పుడు ఆ బియ్యాన్ని ఎవరూ తినకుండా కిలో రూ.10కి అమ్ముకునే వారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి వాటినే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నాణ్యత ఉన్న సన్న బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
స్నేహితుడి నంబర్‌తో మెసేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయం
ఈజీ మనీ కోసం న్యాణత లేని ఆహార పదార్థాల తయారీ.. ఇద్దరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News