Share News

భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:46 AM

సిద్దిపేట జిల్లా సేవాలాల్‌ మహారాజ్‌ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపేసింది.

భర్తను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య
Sevalal Maharaj Thanda Incident

  • ఆస్తి కోసం తరచూ వేధిస్తున్నాడని ఘాతుకం

  • సిద్దిపేట జిల్లా సేవాలాల్‌ మహారాజ్‌ తండాలో ఘటన

అక్కన్నపేట, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా సేవాలాల్‌ మహారాజ్‌ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపేసింది. భర్త చనిపోయాక స్థానిక పోలీసుస్టేషన్‌ వెళ్లి లొంగిపోయింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్‌ మహారాజ్‌ తండాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


జనగామ జిల్లా నర్మేట మండలం మల్కపేట తండాకు చెందిన బానోతు భగవాన్‌(43)కు అక్కన్నపేట మండలం సేవాలాల్‌ మహారాజ్‌ తండాకు చెందిన మాలోతు రాజేశ్వరికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కాగా రాజేశ్వరికి మొదటి పెళ్లి ద్వారా ఒక కూతురు ఉంది. రాజేశ్వరికి మొదటి భర్త నుంచి వచ్చిన ఓ ఇల్లు ఆ కూతురి పేరిట ఉంది. అయితే, రాజేశ్వరి-భగవాన్‌ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రాజేశ్వరి మొదటి కూతురి పేరిట ఉన్న ఆస్తిని ముగ్గురు పిల్లలకు సమానంగా పంచాలని భగవాన్‌ కోరుతున్నాడు.


ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజేశ్వరి.. సేవాలాల్‌ మహారాజ్‌ తండాలోని తన పుట్టింట్లో ఉండగా.. భగవాన్‌ ఆదివారం అక్కడికి వచ్చాడు. ఆస్తి పంపకాలపై మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రాజేశ్వరి.. భర్త భగవాన్‌ను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బలకు భగవాన్‌ ప్రాణాలు కోల్పోయాడని గ్రహించగానే.. అక్కన్నపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏఐ వినియోగంలో జవాబుదారీతనం ముఖ్యం

యాసంగి ‘వరి’ వద్దే వద్దు

నీ అంతు చూస్తా..?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 05:46 AM