Share News

ఏఐ వినియోగంలో జవాబుదారీతనం ముఖ్యం

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:39 AM

కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఏఐ వినియోగంలో జవాబుదారీతనం ముఖ్యం
Duddilla Sridhar Babu

  • విద్యారంగంలో ఏఐతో కీలక మార్పులు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంతోపాటు దాని వినియోగంలో ఎదురయ్యే సవాళ్లపైనా దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్‌ భద్రతకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవా లని పిలుపునిచ్చారు.


ఆదివారం ‘బ్రిలియన్స్‌ ఏఐ’ విద్యా సాంకేతికతను బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ఏఐ వినియోగం ద్వారా విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత మెరుగు పరచవచ్చన్నారు. సంప్రదాయ విద్యావిధానాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

యాసంగి ‘వరి’ వద్దే వద్దు

నీ అంతు చూస్తా..?

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 12 , 2026 | 05:39 AM