యాసంగి ‘వరి’ వద్దే వద్దు
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:33 AM
ఎల్‌నినోతో రాష్ట్రంలో సాగునీటి వనరుల సంక్షోభ పరిస్ధితులున్నందు వల్ల యాసంగి పంటగా వరి సాగు చేసి, ఇబ్బందులు పడొద్దని రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
రెండో పంట వేసి ఇబ్బంది పడొద్దు: మంత్రి పొంగులేటి
కూసుమంచి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో రాష్ట్రంలో సాగునీటి వనరుల సంక్షోభ పరిస్ధితులున్నందు వల్ల యాసంగి పంటగా వరి సాగు చేసి, ఇబ్బందులు పడొద్దని రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఖరీఫ్ వరిపంటను కాపాడేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు.
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాల తర్వాత కూసుమంచిలో జరిగిన సభలో మాట్లాడారు. యాసంగి పంటగా వరి సాగు చేస్తే.. నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్ధితిని తెచ్చుకోవద్దని సూచించారు. ఎల్‌నినోతో విద్యుత్ కొరత తీవ్రమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఛత్రపతి శివాజీ.. ప్రజా నాయకుడు
Read Latest AP News And Telangana News