Share News

ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే దారుణం

ABN , Publish Date - Sep 14 , 2026 | 02:43 PM

సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు.

ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే దారుణం
Siddipet News

సిద్దిపేట, సెప్టెంబర్ 14: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని చిన్న కోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన రాకేష్‌, బిహార్‌కు చెందిన రాజి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. గజ్వేల్‌లో రాజేష్ టీ స్టాల్ నిర్వహిస్తుండగా ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం అనంతరం బతుకుదెరువు కోసం రాకేష్ దంపతులు చిన్నకోడూరు మండల కేంద్రంలో టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.


ఈ క్రమంలో గత అర్ధరాత్రి కూడా ఇరు మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో భార్య రాజిని రాకేష్ గొంతునులిమి హత్య చేశాడు. సిద్దిపేటలోని నాగదేవత గుడి శివారులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 02:45 PM