Share News

సిద్దిపేటలో ఫ్లెక్సీలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:19 AM

సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటకు రానున్న నేపథ్యంలో పలు చోట్ల విద్యార్థులు, పర్యాటకులు, అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.

సిద్దిపేటలో ఫ్లెక్సీలు
Siddipet Flexi Banners

సిద్దిపేట/సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటకు రానున్న నేపథ్యంలో పలు చోట్ల విద్యార్థులు, పర్యాటకులు, అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నియోజకవర్గంలో నిలిచిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలంటూ వీటిని ఏర్పాటు చేశారు. గమనించిన మున్సిపల్‌ సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు. కాగా, సీఎం రేవంత్‌ గురువారం సాయంత్రం 4 గంటల వరకు సిద్దిపేటకు చేరుకొని తొలుత ముస్తాబాద్‌ చౌరస్తాలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.


అక్కడి నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి సభాస్థలి వరకు దాదాపు 2 కిలోమీటర్లు ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం బహిరంగసభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా ఏర్పాట్లను బుధవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం పరిశీలించారు. సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు సభాస్థలి వద్ద కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 04:19 AM