Share News

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పరిశ్రమలు వస్తున్నాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు..

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:41 PM

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పరిశ్రమలు వస్తున్నాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Harish Rao

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు. నంగునూరు మండలం నర్మెట్టలో రూ.700 కోట్లతో చేపట్టిన జూనో జుల్ ప్రైవేట్ కంపెనీ సీపీజీ ప్రాజెక్టు పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యకమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎంపీ భువనేశ్వర్ కలిత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జూనో జుల్ సీఈవో తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని భూములు సేకరించాం. పరిశ్రమలు రావడం మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం వల్ల రైతులకు వరితోపాటు గడ్డికీ డబ్బులు వస్తాయి. రాజకీయాలకు అతీతంగా సంస్థల స్థాపనకు సహకరించాలి. పశ్చిమాసియా యుద్ధం వల్ల భయం నెలకొంది. మన దేశానికి అవసరమైన గ్యాస్ 50 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇలాంటి ప్రాజెక్టులు వస్తే గ్యాస్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తాం. ఇతర దేశాలపై ఆధారపడటం మానేస్తాం' అని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ..

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం: ఎంపీ అరవింద్..

Updated Date - Apr 12 , 2026 | 01:42 PM