Share News

కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా?: ఎమ్మెల్యే హరీశ్ రావు

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:05 PM

తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అంబేడ్కర్ భవన్‌లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారని గుర్తు చేశారు.

కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా?: ఎమ్మెల్యే హరీశ్ రావు
MLA Harish Rao

సిద్దిపేట, నవంబర్ 29: తెలంగాణ చరిత్ర గతిని మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అంబేడ్కర్ భవన్‌లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కేదా? అని ప్రశ్నించారు. దీక్షా దివస్ సందర్భంగా రంగదాంపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 'డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 ఉంటుందా?. కేసీఆర్ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఇచ్చిన 14 రోజుల్లోనే ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమం కారణంగా కేంద్రం వెనక్కి తగ్గింది. ఆనాడు సోనియాగాంధీని ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత, ఇటలీ బొమ్మ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రకటన, ఆయన పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం ఆగమైంది. అభివృద్ధి కుంటుపడింది. పరిపాలన చేతకాక అభివృద్ధిలో వెనుకబడిపోయింది.

ప్రస్తుత సీఎంకి రైతులంటే పట్టదు.. ప్రజలంటే లెక్కలేదు. నాగార్జునసాగర్ ఆంధ్రా వశమైపోతోంది. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయింది. రాక్షస పాలన అంతానికి మళ్లీ మనం కంకణం కట్టుకోవాలి. రామరాజ్యం మళ్లీ తెచ్చుకోవాలి. సిద్దిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. తన సభకు ఇక్కడి ప్రజలు రారని తెలిసి 26 నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చుకున్నారు. వారిని బస్సుల్లో తరలించేందుకు ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి సిద్దిపేటకు ఇచ్చిందేమీ లేదు' అని ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో అత్తాకోడళ్లను కట్టేసి పట్టపగలే రూ.3.20 కోట్ల చోరీ

డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే ప్రమాదం: ఎంపీ మల్లు రవి

Updated Date - Nov 29 , 2026 | 03:05 PM