Share News

హైదరాబాద్‌లో అత్తాకోడళ్లను కట్టేసి పట్టపగలే రూ.3.20 కోట్ల చోరీ

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:33 AM

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని మన్సూరాబాద్‌ చండీశ్వర్‌ కాలనీలో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఏకంగా రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్‌లో అత్తాకోడళ్లను కట్టేసి పట్టపగలే రూ.3.20 కోట్ల చోరీ
Hyderabad Robbery

హైదరాబాద్‌, నవంబరు 29: నగరంలోని ఎల్బీనగర్‌ పరిధిలోని మన్సూరాబాద్‌ చండీశ్వర్‌ కాలనీలో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఏకంగా రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడి.. అక్కడ ఉన్న వృద్ధురాలు, మహిళను బెదిరించి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి బంధించారు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న రూ.3.20 కోట్ల నగదును దోచుకెళ్లారు.

దోపిడీ అనంతరం నిందితులు రెండు ద్విచక్రవాహనాలపై పారిపోయినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఉంటున్న సంపత్‌కుమార్‌రెడ్డి పంపించిన నగదును విజయ్‌కుమార్‌రెడ్డి తన స్నేహితుడి ఇంట్లో భద్రపరిచినట్లు సమాచారం. ఈ నెల 22న బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసిన విజయ్‌.. ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉండటంతో తన స్నేహితుడు ప్రవీణ్‌కు డబ్బు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొద్దిసేపటికే దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దాచి ఉంచిన విషయం.. ఎవరో తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ఎల్బీనగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే 50కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, ఐదుగురు వ్యక్తులు రెండు బ్యాగులతో వెళ్తున్న దృశ్యాలు గుర్తించినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. పట్టపగలే కోట్ల రూపాయల నగదు దోపిడీ జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 12:41 PM