ఓడియమ్మ..బంటి!
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:16 PM
కోతుల బెడదను అరికట్టేందుకు కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
‘ఎలుగుబంటి’ని చూసి కోతులు పరార్
కోహెడ మండలం నకిరేకొమ్ములలో వినూత్న ప్రయత్నం
కోహెడ(మెదక్): కోతుల బెడదను అరికట్టేందుకు కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కోతుల దాడుల నుంచి ప్రజలను, పంటలను రక్షించేందుకు గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు రాజయ్యకు ఎలుగుబంటి వేషం వేయించారు. సర్పంచ్ బుర్ర కల్యాణి మహేష్ ఆలోచనతో రాజయ్య(Rajaiah) ఎలుగుబంటి డ్రెస్ ధరించి గ్రామంలోని వీధులన్నీ తిరుగుతుండడంతో కోతులు భయపడి పరుగులు తీస్తున్నాయి. గతంలో కోతులు ఇళ్లపై పడి ప్రజలను గాయపరిచిన సందర్భాలు ఉండటంతో, ఈ కొత్త పద్ధతికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News