చాట్ జీపీటీకి బిగ్ షాక్.. బాయ్‌కాట్ చేసిన 25 లక్షల మంది.
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:31 PM
పెంటగాన్‌తో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా రక్షణ శాఖలో ఓపెన్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించనున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీకి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా 25 లక్షల మంది చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేశారు. ఒకే సారి 25 లక్షల మంది చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేయటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. పెంటగాన్‌తో చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా రక్షణ శాఖలో ఓపెన్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఒప్పందం నచ్చని యూజర్లు పెద్ద సంఖ్యలో చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారు. తమ ఫోన్‌లలోనుంచి చాట్ జీపీటీ యాప్‌ను డిలీట్ చేసేస్తున్నారు.
టెక్‌క్రంచ్ నివేదిక ప్రకారం.. అమెరికాలో చాట్ జీపీటీ యాప్ అన్ఇన్‌స్టాలేషన్స్ శాతం రోజు రోజుకు పెరుగుతూపోతోంది. పెంటగాన్‌తో చేసుకున్న ఒప్పందంపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ఓపెన్ ఏఐ ఆలోచన్లో పడింది. సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఈ సమస్య ఎంతో జటిలమైనది. స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా అవసరం. పరిస్థితులను చక్కబెట్టడానికి ఎంతో నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం’ అని రాసుకొచ్చారు. అంతేకాదు.. పెంటగాన్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేయడానికి ఓపెన్ ఏఐ చూస్తోందట.
ఆంథ్రోపిక్‌తో వివాదం..
అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించేది. ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ మోడల్స్‌ను అమెరికా మిలటరీ అపరిమతంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకొనేందుకు యాక్సెస్ ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు కంపెనీ ఒప్పుకోలేదు. ఆంథ్రోపిక్‌కు ట్రంప్ ఇచ్చిన గడువు ముగియటంతో ఓపెన్ ఏఐ తెరపైకి వచ్చింది. అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం చేసుకుంది. అయితే, దీన్ని చాట్ జీపీటీ యూజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీకి 900 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఓపెన్ ఏఐ నిర్ణయంతో చాట్ జీపీటీ మూజర్ల సంఖ్య భారీగా పడిపోతోంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..
‘భూమి ఇచ్చేందుకు సిద్ధం’.. పంచగ్రామాల సమస్యలపై మంత్రి ఆనం