ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:50 PM
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో కేసిఆర్ వాహన, ఆయుధపూజ నిర్వహించారు.
సిద్దిపేట, అక్టోబర్ 20: జిల్లాలో ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో కేసిఆర్ వాహన, ఆయుధపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ భార్య శోభ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు రావుతోపాటు పార్టీలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మాజీ సీఎం కేసీఆర్ వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
