సిద్దిపేటకు మేమే స్వాతంత్య్రం తెస్తాం
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:14 AM
సిద్దిపేటకు ఇంకా స్వాతంత్య్రం రాలేదని, సిద్దిపేట ప్రజలు నాయకులు భయం గుప్పెట్లో బతుకుతున్నారని టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు స్వాతంత్య్రం తెస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
హరీశ్‌ను ప్రజాజీవితం నుంచి తరిమేస్తాం: కవిత
సిద్దిపేట అర్బన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేటకు ఇంకా స్వాతంత్య్రం రాలేదని, సిద్దిపేట ప్రజలు నాయకులు భయం గుప్పెట్లో బతుకుతున్నారని టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు స్వాతంత్య్రం తెస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో కోటి లింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె రంగధాంపల్లి వద్ద జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సిద్దిపేటలో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. హరీశ్‌రావును రాజకీయం నుంచే కాకుండా ప్రజాజీవితం నుంచి తరిమేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
హరీశ్‌రావు నీళ్లదొంగ అనుకున్న కానీ బొగ్గు దొంగ కూడా అని ఈ మధ్యనే తెలిసిందన్నారు. 1200 మంది అమరవీరులకు దొరికిన అగ్గిపెట్టె హరీశ్‌రావుకు ఎందుకు దొరకలేదని ప్రశ్నించారు. ఈనెల 19న సిద్దిపేటలో జరిగే సభలో హరీశ్‌రావు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, లేకపోతే గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మ క్కు అయిందని అనుకుంటామన్నారు. పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని చెప్పారు. తెలంగాణ పోరాటానికి కేసీఆర్‌ను సిద్దిపేట ఆశీర్వదించి పంపిందని, ఇప్పుడు తనకు సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన చేస్తోందని విమర్శించారు.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి