వెంటిలేటర్ పనిచేయక చిన్నారి మృతి?
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:41 AM
ఆస్పత్రి లో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఓ 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరి గింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాలిక
హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
నిజాంపేట్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రి లో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఓ 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరి గింది. మెదక్ జిల్లా మాచవరం మండలానికి చెందిన అరుణ్‌కుమార్, ప్రసన్న దంపతుల కుమార్తె యశస్వీ యోగిత (14నెలలు). అరుణ్‌కుమార్ ఉద్యో గరీత్యా ఖతార్‌లో ఉంటున్నారు. ప్రసన్న.. కుమార్తెతో కలిసి బాచుపల్లిలోని సోదరుడు ఇంటికి ఆదివారం వచ్చారు.
పెంపుడు కుక్కతో చిన్నారి ఆడుకుంటూ కిందపడడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసిన వైద్యులు సోమవారం ఉదయం బాలిక మృతి చెందినట్లు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటిలేటర్ పని చేయకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాచుపల్లి సీఐ దాలినాయుడు ఆస్పత్రికి చేరుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. ఈ క్రమంలో తల్లి ప్రసన్నకు ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News