Share News

జీవన్ రెడ్డి విషయంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సింది: జగ్గారెడ్డి

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:36 PM

కాంగ్రెస్ పార్టీని టి. జీవన్ రెడ్డి వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

జీవన్ రెడ్డి విషయంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సింది: జగ్గారెడ్డి
T Jagga Reddy

సంగారెడ్డి, ఏప్రిల్ 09: కాంగ్రెస్ పార్టీని టి. జీవన్ రెడ్డి వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి విషయంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసీ స్థాయిలో పరిశీలన చేసుకుని ఉండాల్సిందని తెలిపారు.


ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానమే నేరుగా రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజమై పోయిందన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను మీడియాతో బహిరంగంగా మాట్లాడలేమని పేర్కొన్నారు. కానీ ఈ అంశాన్ని అంతర్గతంగా పార్టీలో చర్చిస్తామని ఈ సందర్భంగా టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 08:54 PM