Share News

హరీశ్ రావు బంధువు భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ బృందం

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:21 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం పర్యటించింది.

హరీశ్ రావు బంధువు భూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ బృందం

సిద్ధిపేట, సెప్టెంబర్18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆ గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ భూమికి సంబంధించిన వివరాలను కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని ఈ బృందం విచారించింది.


ఈ భూములకు సంబంధించిన రికార్డులు, పహాణీలతోపాటు పట్టాదారు వివరాలపై తహసీల్దార్‌ను ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రతినిధుల బృందం ఆరా తీసింది. ఈ భూముల కొనుగోలు, అసైన్డ్ భూముల వివరాలను ఈ సందర్భంగా ఆ బృందం పరిశీలించింది. ఈ అసైన్డ్ భూముల బదలాయింపు జరిగిందా? లేకా నిబంధనలు పాటించారా? అనే అంశంపై ఈ ప్రతినిధి బృందం వివరాలను సేకరించింది. హరీశ్ రావు మామ హనుమంతరావు భూములను పరిశీలనతో వెలికట్టలోని భూముల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ

మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ

For More TG News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 03:28 PM