Share News

14 నెలలకే పెద్ద కష్టం

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:35 AM

బుడిబుడి అడుగులతో ఇంటిల్లిపాదినీ మురిపించాల్సిన చిన్నారి కూర్చోలేక, నిలబడలేక అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతోంది.

14 నెలలకే పెద్ద కష్టం

  • ఈ పాపకు ప్రాణభిక్ష పెట్టరూ..!

  • స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ వ్యాధితో చిన్నారి పోరాటం

  • ఇంజక్షన్‌కు రూ.9 కోట్లు ఖర్చవుతుందన్న వైద్యులు

  • ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

చేర్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బుడిబుడి అడుగులతో ఇంటిల్లిపాదినీ మురిపించాల్సిన చిన్నారి కూర్చోలేక, నిలబడలేక అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన పుర్మ రాజశేఖర్‌రెడ్డి-మౌనిక దంపతుల 14 నెలల కుమార్తె దీక్షికారెడ్డి దయనీయ స్థితి ఇది. రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.


పుట్టి నెలలు గడిచినా పాప పాకకపోవడంతో నిమ్స్‌, రెయిన్‌బో ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించారు. వెన్నెముక కండరాలను నియంత్రించే నరాలు దెబ్బతిన్నాయని, పాప స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ బారిన పడిందని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి ముదిరితే శ్వాస తీసుకోవడం, ఆహారం మింగడం కూడా కష్టమవుతుందని తెలిపారు. ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉందని, దానికి రూ.9 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఈ ఇంజక్షన్‌ను రెండేళ్ల వయసులోపే ఇవ్వాల్సి ఉండటంతో పాపకు మిగిలిన గడువు పది నెలలే. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, దాతలు స్పందించి తమ బిడ్డ ప్రాణం నిలబెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8143175417 నంబరులో సంప్రదించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 05:35 AM