విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య..
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:25 PM
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్ నగర్, మార్చి 12: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను బావిలో తోసిన తల్లి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పపడింది. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి గురైన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం జంగమ్మ(42) తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి దగ్గరలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.
మొదట ఇద్దరు కూతుళ్లు జ్యోతి(15), శైలజ(13)ను బావిలో తోసింది. అనంతరం జంగమ్మ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె కుమారుడు భయంతో అక్కడ నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాలను బావి నుంచి మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి
గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్
For More TG News And Telugu News