Share News

జడ వేసుకోలేదని బాలికను కరెంటు పైపుతో కొట్టిన టీచర్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:29 AM

ఉపాధ్యాయురాలు కొట్టడంతో తమ కుమార్తె రెండు చేతులు వాచి, పనిచేయడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

జడ వేసుకోలేదని బాలికను కరెంటు పైపుతో కొట్టిన టీచర్‌

  • పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాలలో ఘటన

పెంట్లవెల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురాలు కొట్టడంతో తమ కుమార్తె రెండు చేతులు వాచి, పనిచేయడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెప్పారు. జటప్రోలుకు చెందిన సొప్పరి రవి, మునీశ్వరమ్మల కుమార్తె ప్రమీల అక్కడ ఎనిమిదో తరగతి చదువుతోంది.


ఆమె జడ వేసుకోవడం లేదంటూ సోమవారం ఉదయం ఇంగ్లీష్‌ ఉపాధ్యాయురాలు మంజుల కరెంటు పైపుతో చేతులపై కొట్టినట్టు తెలిపారు. దీంతో వారు పాఠశాలకు వెళ్లి అక్కడి నుంచి ఆమెను పెంట్లవెల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మంగళవారం ఎముకల వైద్యుడిని కూడా సంప్రదించారు. చేతులు వాయడంతో అవి పనిచేయలేని స్థితిలో ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారని తల్లిదండ్రులు వివరించారు. దీంతో ఆ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:30 AM