కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 09:24 PM
దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగు, తాగు నీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వేగవంతానికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.
మహబూబ్‌నగర్, మార్చి 08: దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగు, తాగు నీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వేగవంతానికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తామని ప్రకటించారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 30 నెలల్లో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.
2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కల్వకుర్తి రూ. 909 కోట్లు, నెట్టెంపాడు రూ. 252 కోట్లు కేటాయింపులు చేసినట్లు చెప్పారు. భీమా రూ. 200 కోట్లు, కోయిల్ సాగర్ రూ.185 కోట్లు విడుదల చేస్తామన్నారు. భూసేకరణ, పునరావాసానికి జూన్ 2 నాటికి రూ. 5000 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 55,000 కోట్లు అని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌తో మొత్తం వ్యయం రూ.80,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. జూరాల ప్రాజెక్టులో వెంటనే డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి.. మరొకరికి గాయాలు
వాట్సాప్ గ్రూప్‌లో బాలుడి మృతదేహం ఫొటో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
For More TG News And Telugu News