Share News

విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి.. మరొకరికి గాయాలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 07:57 PM

జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడులో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది.

విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి.. మరొకరికి గాయాలు

మదనపల్లి, మార్చి 08: జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడులో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మరణించిన రెండు మృతదేహాలను సైతం జిల్లా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముదివేడులో జాతర జరుగుతుంది.


ఈ జాతరలో పాల్గొనేందుకు రెడ్డివారిపల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. వారిలో ఇద్దరికి విద్యుత్ షాక్ కొట్టింది. వారిని రక్షించేందుకు మరో బాలిక ప్రయత్నించింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మరణించగా.. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించడంతో.. ఆయా కుటుంబాల్లో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ

వాట్సాప్ గ్రూప్‌లో బాలుడి మృతదేహం ఫొటో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

For More AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 08:32 PM