Share News

వాట్సాప్ గ్రూప్‌లో బాలుడి మృతదేహం ఫొటో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:42 PM

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో వరాహ నది కొండ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

వాట్సాప్ గ్రూప్‌లో బాలుడి మృతదేహం ఫొటో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అనకాపల్లి, మార్చి 08: జిల్లాలోని ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో వరాహ నది కొండ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఈ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని నీటితో శుభ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరణించిన బాలుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అతడి బంధువులకు సమాచారం అందించారు.


మరోవైపు ఆదివారం ఉదయం సదరు బాలుడి రక్తంతో ఉన్న మృతదేహాన్ని ఫోటో తీసి ఏటికొప్పాక వాట్సాప్ గ్రూప్‌లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి మృతదేహం ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. కానీ అక్కడ మృతదేహం లభ్యం కాలేదు.


దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహంపై ఎక్కడా రక్తం లేకుండా నీటితో శుభ్రం చేసినట్లుగా ఉంది. దీంతో బాలుడిని ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అని మాటలేంటి?: స్వామి శ్రీనివాసానంద సరస్వతి

మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ

For More AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 07:28 PM