భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అని మాటలేంటి?: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 02:23 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించిన కల్తీ భగవద్గీతపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆదివారం విశాఖపట్నంలో స్వామి శ్రీనివాసానంద సరస్వతి విలేకర్లతో మాట్లడుతూ.. వైసీపీ హయాంలో ముద్రించిన భగవద్గీత అంతా ఒక పెద్ద కుంభకోణమని అభివర్ణించారు.
విశాఖపట్నం, మార్చి 08: వైసీపీ హయాంలో ముద్రించిన కల్తీ భగవద్గీతపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆదివారం విశాఖపట్నంలో స్వామి శ్రీనివాసానంద సరస్వతి విలేకర్లతో మాట్లడుతూ.. వైసీపీ హయాంలో ముద్రించిన భగవద్గీత అంతా ఒక పెద్ద కుంభకోణమని అభివర్ణించారు. భగవద్గీతను.. జగన్ గీతగా మార్చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో ముద్రించిన భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా లేదని.. భగవద్గీతను అపవిత్రం చేశారని విమర్శించారు. భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అంటూ వ్యాఖ్యలేమిటి?.. ఇది రాజకీయ వ్యాఖ్యలు కావా? అంటూ ఆయన ప్రశ్నించారు.
జగన్ తరచూ మాట తప్పను మడం తిప్పను అనే మాట మాట్లాడేవారని ఈ సందర్భంగా శ్రీనివాసా సరస్వతి గుర్తు చేశారు. టీటీడీ జగన్ తాతగారి వ్యవస్థా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. భగవద్గీతను అపహాస్యం చేసిన వారిని ఏపీ నుంచి బహిష్కరించాలని ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వై.వీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గజిని, ఘోరీ లాంటివారు హిందూ దేవాలయాల మీద దాడి చేశారని.. అంతే కాని హిందూ గ్రంధాలయాలు మీద వారు దాడి చేయలేదని గుర్తు చేశారు. కానీ ఆ పని చేశారంటూ వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతను వక్రీకరించినట్లు ఇతర మతాలలో చేస్తే వారు తాట తీస్తారని హెచ్చరించారు.
టీటీడీ వారు హిందూ గ్రంధాలను ముద్రించారంటే.. అవి ఎంతో విశిష్ట ప్రాధాన్యతతోపాటు వాటిపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు. ఏ భాషలో ముద్రించినా కూడా భక్తులు వాటిని అక్కున చేర్చుకుంటారని వివరించారు. గతంలో టీటీడీ.. ఎంతో జాగ్రత్తలు తీసుకుని వీటిని ముద్రించేదని తెలిపారు. కానీ ఈ వైసీపీ హయాంలో అవగాహన లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించారని విమర్శించారు. వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ చేశారు.. ఆఖరికీ భగవద్గీతను కూడా కల్తీ చేశారని.. చివరకు స్వామి వారి అన్న ప్రసాదం కూడా కల్తీ చేశారన్నారు.
ఇది కచ్చితంగా హిందుత్వం మీద దాడేనని ఆయన అభివర్ణించారు. దర్శనాలను కల్తీ చేశారు.. ఆఖరికి ఉద్యోగులు కూడా కల్తీనే అంటూ.. టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. హిందుత్వం మీద విశ్వాసం లేని వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించారన్నారు. వైఎస్ జగన్ తప్ప.. గతంలో సీఎం కుటుంబ సభ్యులను టీటీడీ చైర్మన్లుగా ఎవరు నియమించ లేదని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు
For More AP News And Telugu News