కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:22 AM
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈసీలో అవకతవకలకు పాల్పడిన వారిని పదవి నుంచి తొలగించడంతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈసీ అవకతవకలపై చర్యలు తీసుకోవాలి
ఓటు హక్కు పరిరక్షణ బాధ్యత కేంద్రానిదే
వనపర్తిలో మంత్రి పొంగులేటి
వనపర్తి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈసీలో అవకతవకలకు పాల్పడిన వారిని పదవి నుంచి తొలగించడంతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏమిటి? అనేది సామాన్య ప్రజలకు అర్థం కావడానికి సమయం పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా రాజకీ య పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా కేంద్రం స్పందించకపోవడం సరికాదన్నారు.
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని, ఎలాంటి కుట్రలకు తావు లేకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడికి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే ఎన్నికల సంఘం వ్యవహారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అనంతరం వనపర్తి కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు తరాలకు భూ హక్కులను సురక్షితంగా అందించాలంటే సమగ్ర సర్వే అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మొదటి విడతలో 50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో రెండున్నర లక్షలు ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని, గులాబీ చొక్కాలు వేసుకొని తిరిగిన అర్హులైన వారికి కూడా ఇస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News