ఖైరతాబాద్ సీటు ఖాళీ
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:06 AM
ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. 2023 ఎన్నికల్లో గెలుపొందిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతయ్య..
2024 ఏప్రిల్ 23 నుంచి వర్తింపు
గెజిట్ విడుదల చేసిన తెలంగాణ అసెంబ్లీ
దానం ఇక మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. 2023 ఎన్నికల్లో గెలుపొందిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతయ్య.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2024 ఏప్రిల్ 23 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానున్నది. తత్ఫలితంగా దానం నాగేందర్ మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఖైరతాబాద్ శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఈ నెల 18న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు చెబితే.. తెలంగాణ శాసనసభ గెజిట్ ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ఉన్నట్లే. అంటే ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీ అయి రెండేళ్ల ఐదు నెలలు దాటడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News