నాగర్ కర్నూల్లో మహాలక్ష్మి రైస్మిల్లుపై కేసు
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:05 AM
నాగర్ కర్నూల్లోని మంతటి చౌరస్తా వద్ద గల మహాలక్ష్మి రైసుమిల్లు యాజమాన్యంతోపాటు 13 మందిపై పోలీసు కేసు నమోదైంది.
నాగర్కర్నూల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్లోని మంతటి చౌరస్తా వద్ద గల మహాలక్ష్మి రైసుమిల్లు యాజమాన్యంతోపాటు 13 మందిపై పోలీసు కేసు నమోదైంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్క దారి పట్టించిన రైస్ మిల్లులపై పౌర సరఫరాలశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. వారితోపాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు చెందిన బృందం.. గురు, శుక్రవారాల్లో రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు చేసింది. మహాలక్ష్మి రైస్మిల్లులో 3,774.818 మెట్రిక్ టన్నుల బియ్యం తారుమారైనట్లు నిర్ధారణకు వచ్చారు. మార్కెట్లో దీని విలువ రూ.9.68 కోట్లు ఉన్నట్లు గణించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు
Read Latest AP News And Telangana News And International