Share News

రాహుల్ గాంధీ పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదు: ఎంపీ డీకే అరుణ

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:40 PM

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ  పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదు: ఎంపీ డీకే అరుణ
DK Aruna

మహబూబ్ నగర్, ఏప్రిల్ 21: లోక్‌‌సభలో ఇటీవలే మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికార ఎన్డీయే పార్టీలు.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు మహిళలు అంటే చిన్నచూపని, చట్టసభల్లోకి మహిళలు రావడం అంటే ఇష్టం లేదంటూ ఎన్డీయే పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా విపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో హుందాగా వ్యవహరించలేదని, మహిళా రిజర్వేషన్ వల్ల ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే అడ్డుకున్నారంటూ ఎంపీ అరుణ మండిపడ్డారు.


'రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. మహిళలను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీకి సమయం వచ్చినప్పుడు బుద్ధిచెప్పాలి. జీడీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో అధికంగా సీట్లు పెరగాలనే ఉద్దేశమా. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది కేవలం అపోహనే. ఈనెల 24న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్ నగర్‌లో పర్యటించనున్నారు. 'ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్'లో గెలుపొందిన క్రీడాకారులకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేస్తారు' అని ఎంపీ అరుణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి

Updated Date - Apr 21 , 2026 | 04:58 PM