Share News

తెలంగాణ ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:26 PM

తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిపై వచ్చిన ఫిర్యాదును మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.

తెలంగాణ ఐఏఎస్‌పై అవినీతి ఆరోపణలు.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Delhi High Court

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిపై వచ్చిన ఫిర్యాదును మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల నిధులతో ఐఏఎస్ అధికారి తన కుమార్తె వివాహం నిర్వహించారని, అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఖర్చులను కాంట్రాక్టర్లే భరించారని పిటిషనర్ ఆరోపించారు.


నాలుగేళ్లుగా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై తార్కిక ముగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందన్న ఢిల్లీ హైకోర్టు.. ఈ ఫిర్యాదుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు ప్రజలే బలం.. కార్యకర్తలే ధైర్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 04:55 PM