Share News

నిజామాబాద్ జిల్లా సిరిపూర్ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు!

ABN , Publish Date - May 27 , 2026 | 02:47 PM

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా సిరిపూర్ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు!
Leopard in Nizamabad

నిజామాబాద్ జిల్లా, మే 27: జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. గ్రామ శివార్లలో ఉన్న ఒక పశువుల పాక సమీపంలోకి చిరుత రావడాన్ని గమనించిన ఓ కుక్క గట్టిగా మొరగడంతో, చిరుత అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయింది. అయితే, ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ (CC TV) ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డు కావడంతో సిరిపూర్ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి, పొలాలకు వెళ్లడానికి రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని, తమకు రక్షణ కల్పించాలని సిరిపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 27 , 2026 | 03:59 PM