రూపారెడ్డి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:29 AM
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులని తెలుస్తోంది.
నల్గొండ, ఆగస్టు 19: కొండమల్లెపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మిస్టరీని ఛేదించారని సమాచారం. ఈ దారుణానికి పాల్పడింది అదే పాఠశాలలో చదివిన వంశీ, అనిల్ అనే విద్యార్థులే అని విచారణలో తేలినట్లు సమాచారం.
డబ్బుల కోసం ఆశపడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు గోవాకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో విద్యార్థుల ప్రమేయం ఉండటం స్థానికంగా దిగ్భ్రాంతిని కలిగించింది. సుమారు 80 మందిని విచారించిన అనంతరం ఆ విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడ్డారని గుర్తించినట్లు సమాచారం. రూపారెడ్డి హత్య అనంతరం ఆ విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..