Share News

మీ ఫాంహౌస్‌లలో బీఆర్‌ఎస్‌ సమ్మిట్‌ పెట్టాలా?

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:02 AM

పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్‌ నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ఈ సదస్సులు కాకుండా వాళ్ల ఫాంహౌస్‌లలో బీఆర్‌ఎస్‌ సమ్మిట్‌ పెట్టాలా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

మీ ఫాంహౌస్‌లలో బీఆర్‌ఎస్‌ సమ్మిట్‌ పెట్టాలా?
Ponguleti Srinivas Reddy

  • పెట్టుబడుల కోసం నిర్వహించిన

  • భారత్‌ సమ్మిట్‌పై విమర్శలు చేస్తారా?

  • రాష్ట్ర ఖజానాను ఇతర రాష్ట్రాలకు..

  • పంచిన విషయం మర్చిపోయారా?

  • బీఆర్‌ఎస్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపాటు

సత్తుపలి/వేంసూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్‌ నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ఈ సదస్సులు కాకుండా వాళ్ల ఫాంహౌస్‌లలో బీఆర్‌ఎస్‌ సమ్మిట్‌ పెట్టాలా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరులలో చేయూత పథకం కింద మంజూరైన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాను ఇతర రాష్ట్రాల్లో పంచిన విషయాన్ని మరిచిపోయారా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఆయన తన కేసులను మాఫీ చేసుకునేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఇంటికి వెళ్లిన విషయం బయటకు వచ్చిందని, దానికి కేటీఆర్‌ ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు.


ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నా పంటలు ఎండిపోకూడదనే లక్ష్యంతో యూనిట్‌ విద్యుత్‌ను రూ.15 చొప్పున కొనుగోలు చేసి వ్యవసాయానికి సరఫరా చేశామని చెప్పారు. రాష్ట్రంలో వానాకాలం పంటను కాపాడిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, పేదవాడికి అవసరాలను గుర్తించి కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వారి గుమ్మం ముందుకు చేరుస్తోందని తెలిపారు. కొత్త పింఛన్లు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అయినా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విషం కక్కుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 06:02 AM